మంగళవారం 04 ఆగస్టు 2020
National - Jul 26, 2020 , 06:42:51

ఏబీ‌వీపీ అధ్య‌క్షుడు వేధి‌స్తు‌న్నాడు.. ఫిర్యాదు చేసిన మహిళ

ఏబీ‌వీపీ అధ్య‌క్షుడు వేధి‌స్తు‌న్నాడు.. ఫిర్యాదు చేసిన మహిళ

చెన్నై: భార‌తీయ జ‌నతాపార్టీ (బీజేపీ) అను‌బంధ విద్యార్థి సంఘం ఏబీ‌వీపీ జాతీ‌యా‌ధ్య‌క్షుడు సుబ్బయ్య షణ్ముగం వేధి‌స్తు‌న్నా‌డని చెన్నైకి చెందిన ఓ మహిళ ఆరో‌పిం‌చారు. పోలీ‌సు‌లకు ఫిర్యా‌దు‌చే‌సినా ఇప్ప‌టి‌వ‌రకు కేసు కూడా నమో‌దు‌చే‌య‌లే‌దని ఆవే‌దన వ్యక్తం‌చే‌శారు. 

52 ఏండ్ల బాధిత‌ మహిళ కుటుంబం, సుబ్బయ్య షణ్ముగం ఒకే అపా‌ర్టు‌మెంట్లో పక్క‌ప‌క్కనే ఉంటు‌న్నారు. తమ కారు పార్కింగ్‌ స్థలాన్ని వాడు‌కు‌న్నం‌దుకు రెంటు ఇవ్వా‌లని అడి‌గా‌మని, అందుకు ప్రతీ‌కా‌రంగా గ‌త నాలుగు నెల‌లుగామ ఆయన వేధిస్తున్నారని బాధి‌తు‌రాలు మీడి‌యాకు తెలి‌పారు. ఫోన్‌‌చేసి అస‌భ్యంగా మాట్లా‌డు‌తు‌న్నా‌డని ఆవే‌దన వ్యక్తం‌చే‌శారు. వాడిన మాస్కుల‌ను ఇంటివ‌ద్ద వేయ‌డం, త‌మ డోర్ వ‌ద్ద మూత్ర‌విస‌ర్జ‌న చేయ‌‌డం వంటి వికృత చ‌ర్యల‌కు పాల్ప‌డ్డాడ‌ని, దీనికి సంబంధించి త‌మ వ‌ద్ద సీసీటీవీ ఫుటేజ్ ఉంద‌ని ఆమె తెలిపారు. 

కాగా, బాధిత మ‌హిళ మీడియాకెక్క‌డంతో ఎట్ట‌కేల‌కు చెన్నైలోని ఆడంబాక‌మ్ పోలీసులు సుబ్బ‌య్య ష‌ణ్ముగంపై ఎఫ్ఐఆర్ న‌మోదు చేశారు. క్వారంటైన్ నిబంధ‌న‌ల‌ను అతిక్ర‌మించాడ‌ని ఆయ‌న‌పై అభియోగాలు మోపారు. కేసును ద‌ర్యాప్తు చేస్తున్నామ‌ని ద‌క్షిణ చెన్నై అద‌న‌పు క‌మిష‌న‌ర్ ఆ దిన‌క‌ర‌న్ వెల్ల‌డించారు. 


logo