Abu Azmi : ఇటీవల మొగల్ చక్రవర్తి (Mughal emperor) ఔరంగజేబ్ (Aurangzeb) ను పొగడ్తల్లో ముంచెత్తి అసెంబ్లీ నుంచి సస్పెన్షన్‌కు గురైన సమాజ్‌వాదీ పార్టీ (Samajwadi Party) ఎమ్మెల్యే (MLA) అబూ ఆసిం అజ్మీ (Abu Asim Azmi).. ఇవాళ ఛత్రపతి (Chhatrapati) శంభాజీ మహరాజ్ (Sambhaji Maharaj) వర్ధంతిని పురస్కరించుకుని ఆయనకు నివాళులు అర్పించారు. అంతేగాక శంభాజీ మహరాజ్‌ను పరాక్రమవంతుడైన యుద్ధవీరుడని అబూ అజ్మీ అభివర్ణించారు.
ఛత్రపతి శివాజీ మహరాజ్ కుమారుడైన శంభాజీ మహరాజ్.. పోర్చుగీసులు, మొఘలులకు వ్యతిరేకంగా సైన్యాలను ముందుకు నడిపించారు. చివరికి శత్రువులకు చిక్కి సంగమేశ్వర్ దగ్గర హత్యకు గురయ్యారు. ఆయనను చిత్రహింసలు పెట్టి హత్య చేశారు. ‘సామ్రాజ్యానికి రెండో ఛత్రపతి, పరాక్రమవంతుడైన యుద్ధ వీరుడు, ధర్మవీర్ శంభాజీ మహరాజ్‌కు నా ఘన నివాళులు.’ అని అబూ అజ్మీ తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు.
ఇటీవల అబూ అజ్మీ.. ఔరంగజేబుపై ప్రశంసలు కురిపించాడు. దానిపై మహారాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వెల్లువెత్తింది. మహా సర్కారు కూడా ఆయనపై మండిపడింది. మార్చి 26న బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు ఆయనను సస్పెండ్ చేసింది.