శ్రీనగర్: జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో(Jammu Kashmir Assembly elections) 88 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నట్లు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ పీకే పోల్ తెలిపారు. సెప్టెంబర్ 18వ తేదీన జరగనున్న తొలి దశ ఏడు జిల్లాల్లో, సెప్టెంబర్ 23న ఆరు జిల్లాల్లో రెండో దశ ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్ ఒకటిన ఏడు జిల్లాలో మూడో దశ ఉంటుందని ఆయన తెలిపారు. దక్షిణ కశ్మీర్‌లోని నాలుగు జిల్లాలు, దోడాలోని మూడు జిల్లాలు మొదటి దశ పోలింగ్‌లో ఉన్నట్లు చెప్పారు.
ప్రతి పోలింగ్ బూత్‌లో కనీస వసతులు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. కొత్తగా 209 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మహిళలు,పురుషులకు వేర్వేరుగా క్యూలైన్లు ఉంటాయన్నారు. వృద్ధులకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. 88 లక్షల మంది ఓటర్లలో.. 44.89 లక్షల మంది పురుష, 43.83 లక్షల మహిళా ఓటర్లు ఉన్నారు. 163 ట్రాన్స్‌జెండర్ ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. నామినేషన్ పేపర్ల దాఖలకు ఆగస్టు 27 చివరి తేది.