Abhishek Banerjee : పశ్చిమ బెంగాల్‌కు చెందిన టీఎంసీ పార్టీలో రాజకీయ సందిగ్ధత ఇంకా కొనసాగుతోంది. ఇప్పటికే ఎమ్మెల్యేల తిరుగుబాటు విషయంలో అసెంబ్లీలో మమతా బెనర్జీకి వ్యతిరేక నిర్ణయం వెలువడింది. రెబల్ ఎమ్మెల్యేనే అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా గుర్తిస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు టీఎంసీ రెబల్ ఎంపీల వ్యవహారంలో ఉత్కంఠ కొనసాగుతోంది. టీఎంసీకి చెందిన దాదాపు 20 మంది ఎంపీలు రెబల్స్‌గా మారిన సంగతి తెలిసిందే. వీరంతా తమను ఎన్సీపీఐలో విలీనం చేయాలని కోరుతున్నారు. ఈ మేరకు రెబల్ ఎంపీలు స్పీకర్‌కు ఇటీవలే లేఖ ఇచ్చారు. ఇప్పుడు ఈ అంశంపై స్పందన తెలుసుకునేందుకు స్పీకర్ టీఎంసీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీని పిలిపించారు.
శుక్రవారం అభిషేక్ బెనర్జీ.. స్పీకర్‌ను కలిశారు. తిరుగుబాటు చేసిన ఎంపీలను అనర్హులుగా ప్రకటించాలని ఆయన స్పీకర్‌ను కోరారు. ఎంపీల విలీనాన్ని ఆయన వ్యతిరేకించారు. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న ఎంపీలపై చర్యలు తీసుకోవాలని కోరారు. రాజ్యాంగాన్ని అనుసరించి రెబల్ ఎంపీలను అనర్హులుగా ప్రకటించాలని, విలీన ప్రతిపాదనను తిరస్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశానికి అభిషేక్ బెనర్జీతోపాటు టీఎంసీ ఎంపీలు మహువా మొయిత్రా, సౌగతా రాయ్, డెరెక్ ఒబ్రియెన్ పాల్గొన్నారు. అభిషేక్ బెనర్జీ అభిప్రాయం తెలుసుకున్న తర్వాత ఎంపీల విలీనం లేదా అనర్హత వేటు అంశాల్లో స్పీకర్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇటీవలి అసెంబ్లీ ఫలితాల అనంతరం టీఎంసీ రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యేలు పార్టీపై తిరుగుబాటు చేయగా, ఎంపీలు కూడా రెబల్స్‌గా మారి వేరే పార్టీలో విలీనం చేయాలని కోరుతున్నారు. విలీనం జరిగితే టీఎంసీకి భారీ ఎదురుదెబ్బ తప్పదు.
ఈ అంశంపై స్పీకర్‌తో మీటింగ్ తర్వాత అభిషేక్ బెనర్జీ మాట్లాడుతూ.. రెబల్ ఎంపీల చర్యలు పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉన్నాయని, వారు స్వచ్ఛందంగా టీఎంసీ సభ్యత్వాన్ని వదులుకోవడానికి సిద్ధపడ్డారని చెప్పారు. అందువల్ల పార్టీ ద్వారా వారికి వచ్చిన ఎంపీ పదవుల్ని కూడా రద్దు చేయాలని కోరారు. ఈ విషయంలో స్పీకర్ తమకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. స్పీకర్ నిర్ణయంపై ఎంపీల భవిష్యత్, టీఎంసీ భవిష్యత్ ఆధారపడి ఉంది.