కోల్కతా, మే 21: పశ్చిమబెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తామ్లుక్ బీజేపీ అభ్యర్థి, కలకత్తా హైకోర్టు మాజీ జడ్జి అభిజిత్ గంగోపాధ్యాయ్పై ఎన్నికల సంఘం చర్యలు తీసుకొన్నది. ఆయన ఎన్నికల ప్రచారం చేయకుండా 24 గంటల నిషేధం విధిస్తూ మంగవారం నిర్ణయం తీసుకొన్నది.
గంగోపాధ్యాయ్ వ్యాఖ్యలను ‘తక్కువ స్థాయి వ్యక్తిగత దాడి’గా పేర్కొన్న ఈసీ.. ఆయన ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని స్పష్టం చేసింది. అభిజిత్ గంగోపాధ్యాయ్ నిషేధం మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి అమలవుతుంది. ఈనెల 15న హల్దియాలో జరిగిన ఓ సభలో అభిజిత్ చేసిన అభ్యంతరకర ప్రసంగంపై టీఎంసీ ఫిర్యాదు మేరకు ఈసీ ఈ మేరకు చర్యలు తీసుకొన్నది.