చండీగఢ్, జనవరి 28: హర్యానా ఎన్నికల్లో పోటీపై ఆమ్ ఆద్మీ పార్టీ తన వైఖరిని వెల్లడించింది. శాసనసభ ఎన్నికల్లో ఆ రాష్ట్రంలోని 90 అసెంబ్లీ స్థానాల్లో తమ పార్టీ సొంతంగానే పోటీ చేస్తుందని, లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం ఇండియా కూటమి పొత్తుతో బరిలోకి దిగుతామని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం స్పష్టం చేశారు. కాగా, సార్వత్రిక ఎన్నికలు ఈ ఏడాది ఏప్రిల్-మే నెలల్లో జరగనుండగా, అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది జరగనున్నాయి. కాగా, ఆప్ అధికారంలో ఉన్న పంజాబ్‌లో వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీచేస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆప్ నేత భగవంత్‌సింగ్ మాన్ ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే.