Saurabh Bharadwaj : కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే చేసిన మోదీ చైనా గ్యారంటీ వ్యాఖ్యలపై ఆప్ నేత సౌరభ్ భరధ్వాజ్ స్పందించారు. చైనా నియంత్రణ రేఖను (LAC) దాటి 5 కిలోమీటర్ల వరకూ మన భూభాగంలోకి చొచ్చుకొచ్చిందని అమెరికాకు చెందిన శాటిలైట్ ఇమేజింగ్ కంపెనీ వెల్లడించిందని చెప్పారు. ప్యాంగాంగ్ సరస్సు వద్ద చైనా బంకర్లను నిర్మిస్తోందని, ఆ ప్రాంతంలో చైనా తన సైన్యాన్ని మోహరించిందని ఆప్ నేత పేర్కొన్నారు.
మరోవైపు 2019-20 తర్వాత భారత్ సై=నిక నియామకాలను నిలిపివేసిందని అన్నారు. ఏటా 60000 మంది సైనికులు రిటైరవుతుంటే గత ఐదేండ్లుగా మన సైన్యంలో 3 లక్షల సైనికుల కొరత ఉందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం చైనాకు మోకరిల్లిందని సౌరభ్ భరద్వాజ్ ఆరోపించారు. చైనా తన వాణిజ్యంపై అధికంగా భారత్‌పై ఆధారపడిందని, కానీ మనం చైనాతో వాణిజ్యాన్ని నిలిపివేయలేకపోతున్నామని వ్యాఖ్యానించారు.
మణిపూర్‌లో రాహుల్ గాంధీ పర్యటనను ప్రస్తావిస్తూ ఈశాన్య ప్రాంతంలోకి చైనా మెల్లిగా చొచ్చుకొస్తోందని, తీవ్రవాదం, తిరుగుబాట్ల కారణంగా దశాబ్ధాలుగా ఈశాన్య రాష్ట్రాల్లో కల్లోలం నెలకొనగా, మణిపూర్ గత ఏడాదిగా ఘర్షణలతో అట్టుడుకుతున్నదని అన్నారు. హింస ప్రజ్వరిల్లిన మణిపూర్‌లో పర్యటించాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరుకోవడం లేదని మండిపడ్డారు. ప్రధాని మోదీకి విదేశీ పర్యటనలకు సమయం ఉంటుంది కానీ హథ్రాస్, మణిపూర్‌లను సందర్శించేందుకు సమయం ఉండదని ఆయన దుయ్యబట్టారు.
Read More :
ITR | కొత్త పన్ను విధానంలో మార్పులు.. ఇవి మీకు తెలుసా?