బీజేపీ ‘ఆపరేషన్ లోటస్’పై సీబీఐ కార్యాలయం ఎదుట ఆప్ ఆందోళన
బీజేపీ ‘ఆపరేషన్ లోటస్’పై ఆప్ ఆందోళన వ్యక్తం చేసింది. బుధవారం ఢిల్లీలోని సీబీఐ కార్యాలయం వద్ద ఆప్ నేతలు బైఠాయించారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు యత్నించిన బీజేపీపై చర్యలు తీసుకోవాలంటూ వారు...
న్యూఢిల్లీ : బీజేపీ ‘ఆపరేషన్ లోటస్’పై ఆప్ ఆందోళన వ్యక్తం చేసింది. బుధవారం ఢిల్లీలోని సీబీఐ కార్యాలయం వద్ద ఆప్ నేతలు బైఠాయించారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు యత్నించిన బీజేపీపై చర్యలు తీసుకోవాలంటూ వారు డిమాండ్ చేశారు.
బీజేపీ ‘ఆపరేషన్ లోటస్’ పై విచారణకు ఆప్ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆప్ ఎంపీలు సంజయ్ సింగ్, సౌరభ్ భరద్వాజ్, అతిషి తదితర నేతలు బుధవారం సీబీఐ ప్రధాన కార్యాలయం ఎదుట బైఠాయించి దీనిపై విచారణ జరిపించాలని కోరింది. సీబీఐ కార్యాలయంలోకి చొచ్చుకు వచ్చేందుకు ప్రయత్నించిన పలువురు ఆప్ నేతలను పోలీసులు బారికేడ్లు పెట్టి అడ్డుకున్నారు. దాంతో వారు కార్యాలయం వెలుపల ధర్నాకు కూర్చున్నారు. ‘ఆపరేషన్ లోటస్’ పేరుతో బీజేపీ పలు రాష్ట్రాల్లో ప్రభుత్వాలను పడగొట్టేందుకు ప్రయత్నిస్తున్నదని ఆప్ ఆరోపించింది.
‘ఆపరేషన్ లోటస్’పై బీజేపీ రూ.6,300 కోట్లపైగా ఖర్చు చేసిందని ఆప్ నేతలు ఆరోపించారు. దీనిపై దర్యాప్తు జరపాలని పార్టీ డిమాండ్ చేస్తున్నదని ఆప్ నేత అతిషి ట్వీట్ చేశారు. ‘ఆపరేషన్ లోటస్’పై ఫిర్యాదు చేసేందుకు ఆప్ ఎమ్మెల్యేల బృందం సీబీఐ ప్రధాన కార్యాలయానికి వెళ్తగా పోలీసులు అడ్డుకుని బయటకు పంపించారని ఆప్ ఆరోపించింది. దేశవ్యాప్తంగా ‘ఆపరేషన్ కమలం’పై బీజేపీ వెచ్చించిన రూ.6,300 కోట్ల మూలాలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నామని ఎంపీ సంజయ్ సింగ్ పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

