Arvind Kejriwal | వచ్చే నెల 5వ తేదీన ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) న్యూ ఢిల్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇవాళ కేజ్రీ నామినేషన్ దాఖలు చేయనున్నారు.
నామినేషన్ దాఖలుకు ముందు కన్నౌట్ ప్రాంతంలోని (Connaught Place) హనుమాన్ ఆలయాన్ని (Hanuman Mandir) కేజ్రీవాల్ సందర్శించారు. భార్య సునీతతో కలిసి ఆలయానికి చేరుకున్న కేజ్రీవాల్ అక్కడ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రిటర్నింగ్ ఆఫీస్కు వరకూ ర్యాలీగా బయల్దేరనున్నారు. అక్కడ నామినేషన్ దాఖలు చేస్తారు. కాగా ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 5న పోలింగ్ జరగనుంది. ఫిబ్రవరి 8న ఓట్లను లెక్కించి ఫలితాలు వెల్లడించనున్నారు.
#WATCH | Delhi: AAP National Convenor Arvind Kejriwal along with his wife offers prayers at Pracheen Hanuman Mandir in Connaught Place.
He will file his nomination from the New Delhi Assembly Seat today #DelhiElection2025 pic.twitter.com/sOCPNUhPnE
— ANI (@ANI) January 15, 2025
Also Read..
Car Parking | కారు కొనాలంటే పార్కింగ్ స్థలం చూపించాల్సిందే.. మహారాష్ట్ర ప్రభుత్వం కొత్త రూల్
Dense Fog | ఉత్తర భారతంపై పొగమంచు తీవ్రత.. విమాన, రైలు సర్వీసులకు అంతరాయం