న్యూఢిల్లీ, జూలై 23: ఢిల్లీలో పాలనపరమైన అధికారాలపై పెత్తనం కోసం కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ స్థానంలో బిల్లును తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా తెలిపారు. ఈ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టడానికి అనుమతించవద్దని సభ చైర్మన్ ధన్కర్కు లేఖ రాశారు.
రానున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని ఢిల్లీ ఎమ్మెల్యే, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మధ్యప్రదేశ్ రాష్ట్ర ఇన్చార్జ్ భూపిందర్ సింగ్ తెలిపారు. రాష్ట్రంలోని అన్నీ స్థానాల్లోనూ ఆప్ పోటీ చేస్తుందని పేర్కొన్నారు.