కర్నాల్: పంజాబ్‌లో ఆప్ తిరుగుబాటు ఎమ్మెల్యే హర్మీత్ సింగ్ ధిల్లాన్ పథన్మజ్రాను రేప్, మోసం అభియోగాలపై మంగళవారం కర్నాల్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు. కస్టడీలో ఉన్న ఆయన పోలీస్ అధికారులపై కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యారు. అంతకు ముందు ఆయన ఒక అధికారిపైకి వాహనాన్ని పోనిచ్చి ఆ తర్వాత స్కార్పియో వాహనంలో పరారయ్యారు.
జిరక్‌పూర్‌కు చెందిన మహిళ ఒకరు హర్మీత్ సింగ్‌పై రేప్, చీటింగ్ ఆరోపణలు చేశారు. విడాకులు తీసుకున్నట్టు నమ్మించి తనను 2021లో హర్మీత్ సింగ్ పెండ్లి చేసుకున్నారని తెలిపారు. ఆ తర్వాత ఆయన తనను లైంగికంగా వేధించారని, అశ్లీల విషయాలను పంపించి బెదిరించారని ఆమె ఆరోపించారు.