కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ఆద్మీ తన విజయ పరంపరను కొనసాగిస్తూనే వుంది. మొన్నటికి మొన్న పంజాబ్‌ను క్లీన్ స్వీప్ చేసిన ఆ పార్టీ… తాజాగా రాజ్యసభ ఎన్నికల్లోనూ ఐదింటికి ఐదు సీట్లలో విజయం సాధించింది. ఆప్ నుంచి బరిలోకి దిగిన ఐదుగురు అభ్యర్థులూ ఏకగ్రీవమయ్యారు.
రాఘవ్ చద్దా, హర్భజన్ సింగ్, సందీప్ పాఠక్, సంజీవ్ అరోడా, అశోక్ మిత్తల్‌ను పంజాబ్ నుంచి ఆప్ తరపున రాజ్యసభ సభ్యులుగా ప్రకటించింది. ఇతర పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించలేదు. దీంతో ఎలాంటి ఓటింగ్ లేకుండా… ఈ ఐదుగురూ ఏకగ్రీవమయ్యారు. అయితే.. ఈ విషయాన్ని మార్చి 31 న అధికారికంగా ప్రకటిస్తారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ 92 సీట్లలో విజయ దుందుభి మోగించిన విషయంతెలిసిందే.