న్యూఢిల్లీ: ఆప్ విద్యార్థి విభాగం ఏర్పాటు చేస్తున్నట్టు ఆ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం ప్రకటించారు. దీనికి ‘అసోసియేషన్ ఆఫ్ స్టూడెంట్స్ ఫర్ ఆల్టర్నేటివ్ పాలిటిక్స్'(ఏఎస్ఏపీ)గా నామకరణం చేశారు.
ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో భారీ ఓటమి మూటగట్టుకోవడంతో పాటు ఆ పార్టీకి చెందిన 15 మంది కౌన్సిలర్లు రాజీనామా చేసి, ఇంద్రప్రస్థ వికాస్ పార్టీ(ఐవీపీ)ని ప్రకటించారు. దీంతో ఆయన రంగంలోకి దిగారు. ఈ విద్యార్థి విభాగం విద్యారంగంలో మార్పు కోసం ఉద్యమించడంతో పాటు ప్రత్యామ్నాయ రాజకీయాల్లో మార్పునకు సంకేతంగా నిలుస్తుందని చెప్పారు.