Jammu Kashmir Assembly Elections : సెప్టెంబర్ 18 నుంచి మూడు దశల్లో పోలింగ్ జరిగే జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు ఆమ్ ఆద్మీ పార్టీ ఆదివారం ఏడుగురు అభ్యర్ధులతో కూడిన తొలి జాబితాను విడుదల చేసింది. పుల్వామా నుంచి ఫయాజ్ అహ్మద్, ముదస్సిర్ హసన్ (రాజ్‌పుర), షేక్ ఫిదా హుస్సేన్ (దేవ్సర్), మోహిసిన్ షఫ్తకత్ మిర్ (దురు), యాసిర్ షఫి మట్టో (దోడా వెస్ట్)ను పార్టీ అభ్యర్ధులుగా బరిలో నిలిపింది.
ఇక సెప్టెంబర్ 18న తొలి దశ పోలింగ్ జరగనుండా, 25న రెండో దశ పోలింగ్, అక్టోబర్ 1న మూడో దశ పోలింగ్ జరగనుంది. అక్టోబర్ 4న ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తారు. ఇక మొత్తం 90 నియోజకవర్గాలకు గాను తొలి దశలో 24 స్ధానాలకు పోలింగ్ జరగనుండగా, రెండో దశలో 26, తుది దశ పోలింగ్‌లో 40 స్ధానాలకు పోలింగ్ జరుగుతుంది. కాగా, జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ మధ్య పొత్తుపై కాంగ్రెస్ నేత రణ్‌దీప్ సుర్జీవాలా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరు పార్టీల పొత్తుపై బీజేపీ ఎందుకు భుజాలు తడుముకుంటున్నదని ఆయన ప్రశ్నించారు.
గతంలో బీజేపీ ఏ పార్టీతో కలిసినా తాము వారు ఎందుకు కలిశారని ఎన్నడూ అడగలేదని గుర్తుచేశారు.అలాంటిది ఇప్పుడు తమను బీజేపీ ఎందుకు ప్రశ్నిస్తున్నదని నిలదీశారు. హరియాణలోని కైథల్‌లో సుర్జీవాలా ఆదివారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. బీజేపీ గతంలో నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీలతో పొత్తు పెట్టుకోలేదా అని ఆయన ప్రశ్నించారు. గతంలో వారు పలు పార్టీలతో అంటకాగారని, మీరు గతంలో ఇలా వ్యవహరించి ఇప్పుడు పొత్తుపై తమను బీజేపీ ప్రశ్నించడం విడ్డూరంగా ఉందని అన్నారు.
Read More :
Former IAS Sharma | యజమానులను జైలుకు ఎందుకు పంపడం లేదు.. చంద్రబాబుకు మాజీ ఐఏఎస్ అధికారి లేఖ