Aadhar Update | న్యూఢిల్లీ: పదేండ్ల క్రితం నాటి ఆధార్ కార్డుల్లోని వివరాలను ఉచితంగా అప్డేట్ చేసుకోవడానికి శనివారం ఆఖరు తేదీ అని ఉడాయ్ ప్రకటించింది. ఇందుకోసం వ్యక్తిగత గుర్తింపు, చిరునామా పత్రాలను అప్లోడ్ చేయాలని తెలిపింది.
ఉడాయ్ అధికార వెబ్సైట్ http://myaadhar.uidai.gov.inలో ఆధార్ నంబర్, మొబైల్ నంబర్ సాయంతో లాగిన్ అయి వివరాలను అప్డేట్ చేసుకోవచ్చని చెప్పింది. సెప్టెంబర్ 14 తర్వాత మార్పులు చేసుకోవాలంటే రూ.50 జరిమానా చెల్లించాలని తెలిపింది. వేలిముద్రలు, ఐరిస్ స్కాన్స్, ముఖ చిత్రాల వంటి బయో మెట్రిక్ సమాచారాన్ని ఆన్లైన్లో అప్డేట్ చేసుకోలేరని తెలిపింది.
ఎస్ఎస్బీ చీఫ్‌గా అమృత్ మోహన్ ప్రసాద్
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 13: సశస్త్ర సీమా బల్(ఎస్ఎస్బీ) డైరెక్టర్ జనరల్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి అమృత్ మోహన్ ప్రసాద్ శుక్రవారం నియమితులయ్యారు. ప్రసాద్ 1989 బ్యాచ్‌కు చెందిన ఒడిశా క్యాడర్ ఐపీఎస్ అధికారి. ప్రస్తుతం ఆయన సీఆర్పీఎఫ్ ప్రత్యేక డైరెక్టర్ జనరల్‌గా పని చేస్తున్నారు.