న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ‘ఆధార్ డాటా’ క్లీన్-అప్ కార్యక్రమాన్ని చేపట్టినట్టు కేంద్రం తాజాగా ప్రకటించింది. చనిపోయిన 2 కోట్ల మందికిపైగా ఆధార్ కార్డులను డీయాక్టివేట్ చేసినట్టు ‘భారత విశిష్ఠ గుర్తింపు ప్రాధికారిక సంస్థ’ (ఉడాయ్) పేర్కొన్నది. ఆధార్ డాటాబేస్ సమగ్రతను కాపాడటం, గుర్తింపు ఆధారాల దుర్వినియోగాన్ని నిరోధించటమే లక్ష్యంగా ఈ క్లీన్-అప్ కార్యక్రమం సాగినట్టు ఉడాయ్ తెలిపింది.