న్యూఢిల్లీ, జూలై 31: పాఠశాలల్లో పిల్లలకు అడ్మిషన్ల కోసం ఆధార్ తప్పనిసరి కాదని కేంద్ర ప్రభుత్వం సోమవారం మరోసారి స్పష్టం చేసింది. ఆధార్ కార్డు లేదన్న కారణంతో ఏ చిన్నారికి అడ్మిషన్, ఇతర సదుపాయాలు నిరాకరించకూడదని పునరుద్ఘాటించింది. అడ్మిషన్లు ఇచ్చేందుకు కొన్ని పాఠశాలల్లో ఇంకా ఆధార్ కార్డు అడుగుతున్నారనే వార్తల నేపథ్యంలో కేంద్ర పైవిధంగా స్పందించింది. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ లోక్సభలో ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు.