UIDAI: ఆధార్‌పై మూడీస్ ఆరోపణలు నిరాధారం: యూఐడీఏఐ
UIDAI: ప్రపంచంలోనే అత్యంత విశ్వసనీయమైన డిజిటల్ ఐడీ కార్డు ఆధార్ అని యూఐడీఏఐ పేర్కొన్నది. ఆధార్‌పై మూడీస్ ఇన్వెస్టర్ సంస్థ చేసిన ఆరోపణలను ఖండించింది. ఆ ఆరోపణలు నిరాధారం అని పేర్కొన్నది. ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్ లాంటి సంస్థలు ఆధార్‌ను ప్రశంసించినట్లు యూఐడీఏఐ వెల్లడించింది.
న్యూఢిల్లీ: కేంద్ర సర్కార్ జారీ చేస్తున్న ఆధార్ కార్డులపై ఇంటర్నేషనల్ క్రెడిట్ ఏజెన్సీ మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఆ ఆరోపణలపై యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(UIDAI) ప్రకటన చేసింది. ఎటువంటి ఆధారాలు లేకుండానే ఆధార్ కార్డులపై మూడీస్ సంస్థ ఆరోపణలు చేసినట్లు యూఏడీఏఐ పేర్కొన్నది. ఆధార్ కార్డు సర్వీస్ సరిగా లేదని, వేడి వాతావరణంలో బయోమెట్రిక్ టెక్నాలజీ నమ్మదగినదిగా లేదని మూడీస్ సంస్థ ఆరోపించిన విషయ తెలిసిందే. అయితే ఎటువంటి సాక్ష్యాలు లేకుండానే ఆధార్ కార్డులపై ఇన్వెస్టర్ సంస్థ నిరాధార ఆరోపణలు చేసిందని, ప్రపంచంలోనే ఆధార్ కార్డు అత్యంత నమ్మకమైన డిజిటల్ ఐడీ అని, గత దశాబ్ధ కాలంలో వంద కోట్ల మంది భారతీయులు తమ గుర్తింపును ఆ కార్డుతో వెయ్యి కోట్ల సార్లు చూపించుకున్నట్లు యూఐడీఏఐ ఒక ప్రటకనలో తెలిపింది.
మూడీస్ ఇచ్చిన డేటాతో తాము ఏకీభవించడం లేదని యూఐడీఏఐ పేర్కొన్నది. ఆధార్ డేటాబేస్‌లో ఎటువంటి ఉల్లంఘన జరగలేదని ఇటీవల పార్లమెంట్లో కూడా పేర్కొన్నట్లు యూఐడీఏఐ తెలిపింది. అంతర్జాతీయ సెక్యూర్టీ, ప్రైవసీ ప్రమాణాల ప్రకారమే ఆధార్‌ను జారీ చేస్తున్నట్లు తెలిపారు.ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్ లాంటి సంస్థలు ఆధార్ వ్యవస్థను మెచ్చుకున్నాయని యూఐడీఏఐ పేర్కొన్నది. అనేక దేశాలు ఆధార్ శైలిలో తమ ఐడీలను రూపొందించుకున్నట్లు యూఐడీఏఐ తెలిపింది.
#Aadhaar, the most trusted #DigitalIdentity in the world — Moody’s Investors Service opinions baseless
For more details please read at https://t.co/Yz2AVJIjkV@GoI_MeitY @PIB_India @_DigitalIndia @mygovindia
— Aadhaar (@UIDAI) September 25, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
TG-SAFE | ఇవి తింటే రోగాలే..! టీజీసేఫ్ తనిఖీల్లో విస్తుపోయే విషయాలు వెలుగులోకి
NIMS Hospital | నిమ్స్‌లో ఓపీ సమయం పెంపు.. మధ్యాహ్నం 2.00 గంటల వరకు రిజిస్ట్రేషన్లు
Rashmika Mandanna | సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన రష్మిక మందన్న.. 400 కుటుంబాలకు చేయూత
Kaleshwaram Project | రిపేరెందుకు చేయలే.. మేడిగడ్డ బరాజ్‌పై కేంద్ర సాంకేతిక కమిటీ సూటి ప్రశ్నలు.. నీళ్లు నమిలిన రేవంత్ సర్కార్
RS Praveen Kumar | రేవంత్ ప్రొటెక్షన్ ఫోర్స్‌గా ఆర్పీఎఫ్..! ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆగ్రహం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

