న్యూఢిల్లీ, సెప్టెంబర్ 14: ఆన్లైన్లో ఆధార్ ఉచిత అప్డేట్ గడువును మరోసారి పొడిగించారు. ఆధార్లో మార్పులు, చేర్పులు ఉచితంగా చేసుకోవడానికి గడువు ఈ నెల 14న ముగియడంతో పౌరులకు ఈ సౌకర్యాన్ని మరికొంత కాలం కొనసాగించడం కోసం ఈ ఏడాది డిసెంబర్ 14 వరకు దీనిని పొడిగిస్తున్నట్టు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) శనివారం వెల్లడించింది. ఆధార్ కార్డులు తీసుకుని గత పదేండ్లు దాటి అప్పటి నుంచి చిరునామా, ఇతర వివరాలు అప్డేట్ చేసుకోని పౌరులు వాటిని ఉచితంగా అప్డేట్ ‘మై ఆధార్ పోర్టల్’లో చేసుకోవాలని యూఐడీఏఐ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.