న్యూఢిల్లీ, సెప్టెంబర్ 25: ఆధార్ కార్డును మరింత సులభంగా పొందే ప్రక్రియను భారత విశిష్ఠ గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) ప్రవేశపెట్టింది. పౌరులు ఇక నుంచి తమ ఆధార్ కార్డును వాట్సాప్ ద్వారానే డౌన్లోడ్ చేసుకోవచ్చు. డిజీ లాకర్‌తో అనుసంధానించిన అధికారిక మైగవ్ హెల్ప్‌డెస్క్ చాట్‌బాట్ ద్వారా ఇప్పుడు నేరుగా దీనిని వాట్సాప్‌లో డౌన్లోడ్ చేసుకోవచ్చు.
దీని కోసం మైగవ్ హెల్ప్‌డెస్క్ నెంబర్ +91-9013151515ను ఫోన్ నెంబర్లో సేవ్ చేసుకోవాలి. ఈ నెంబర్‌కు వాట్సాప్ ద్వారా హాయ్ లేదా నమస్తే (ఇంగ్లిష్‌లో) అని పంపితే చాట్‌బాట్ దశలవారీగా మీకు మార్గనిర్దేశం చేస్తుంది. అయితే డీజీ లాకర్లో ఆధార్ ఇప్పటికే భద్రపరిచి ఉండాలి. వాట్సాప్ ద్వారా ఒకేసారి ఒక పత్రాన్ని మాత్రమే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ విధానం 24×7 అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు.