పదేండ్లకోసారి ఆధార్ అప్డేట్
ఆధార్ కార్డుదారులంతా ప్రతి పదేండ్లకోసారి తమ బయోమెట్రిక్ డాటా, ఇతర వివరాలను అప్డేట్ చేసుకోవాలని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) సూచించింది.
- వయోజనులకు యూఐడీఏఐ సూచన
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 18: ఆధార్ కార్డుదారులంతా ప్రతి పదేండ్లకోసారి తమ బయోమెట్రిక్ డాటా, ఇతర వివరాలను అప్డేట్ చేసుకోవాలని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) సూచించింది. ప్రస్తుతం 5 నుంచి 15 ఏండ్లవారు తప్పనిసరిగా ఆధార్ వివరాలను అప్డేట్ చేసుకోవాల్సి ఉన్నది. ఇకపై వయోజనులు కూడా ప్రతి పదేండ్లకోసారి స్వచ్ఛందంగా ఆధార్ వివరాలను అప్డేట్ చేసుకోవాలని యూఐడీఏఐ తెలిపింది. 70 ఏండ్ల వయసు దాటిన వృద్ధులు మాత్రం ఆధార్‌ను అప్డేట్ చేసుకోనక్కర్లేలేదని స్పష్టం చేసింది. మేఘాలయ, నాగాలాండ్, లడఖ్ మినహా దేశంలోని అన్ని ప్రాంతాల్లో వయోజనులను ఆధార్‌లో చేర్చినట్టు యూఐడీఏఐ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 93.65 శాతం మందికి ఆధార్ కార్డులు ఉన్నాయని పేర్కొన్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Biometric Data
- uidai
RELATED ARTICLES
తాజా వార్తలు
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్‌కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
Punjab Drug | పంజాబ్‌లో పిజ్జా కన్నా వేగంగా డ్రగ్స్ డెలివరీ.. ఆప్, బీజేపీపై సచిన్ పైలట్ ధ్వజం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

