న్యూఢిల్లీ: కొత్త సిమ్‌కార్డులకు ఆధార్ బయోమెట్రిక్ వెరిఫికేషన్‌ను కేంద్రం తప్పనిసరి చేసింది. ఈ మేరకు టెలికమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్(డీఓటీ)కి ప్రధాన మంత్రి కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది. రిటైలర్స్ ఈ ప్రక్రియను నిర్వహించకుండా సిమ్‌లను అమ్మడంపై నిషేధం విధించింది.
ఈ నిబంధనలను ఉల్లంఘించేవారిని గుర్తించేందుకు కృత్రిమ మేధ సహకారం తీసుకోవాలని, దర్యాప్తు సంస్థలతో సమన్వయంతో పని చేయాలని ఆదేశించింది. నకిలీ పత్రాల ద్వారా మొబైల్ కనెక్షన్స్‌ను పొంది, నేరాలు, మోసాలకు పాల్పడటానికి కళ్లెం వేయడం కోసం ఈ చర్యలు తీసుకుంది. గతంలో ఓటర్ ఐడీ, పాస్‌పోర్టు వంటి పత్రాలను చూపించి, కొత్త సిమ్‌లను పొందేవారు.