ఔరాయా (ఉత్తరప్రదేశ్), మార్చి 14: ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ యువతి కృష్ణుడిని వివాహమాడారు. ఎల్ఎల్బీ చదువుతున్న ఆమె తాను కృష్ణుడిని పెండ్లి చేసుకోవాలను కుంటున్నట్టు తండ్రితో చెప్పారు. ఒప్పుకొన్న ఆయన ఘనంగా ఏర్పాట్లు చేశారు. బంధుమిత్రులను పిలిచి పెండ్లి వేడుకను నిర్వహించారు.
కృష్ణుడి విగ్రహాన్ని మండపానికి తీసుకొచ్చి పెండ్లి జరిపారు. పూర్తిగా సంప్రదాయ పద్ధతిలో ఈ వేడుక ముగిసింది.