శ్రీనగర్: కోచింగ్కు వెళ్లిన ఓ మహిళను చంపి, ముక్కలుగా కోసి వివిధ ప్రాంతాల్లో పాతి పెట్టిన ఘటన జమ్ము కశ్మీర్లోని బుద్గామ్ జిల్లాలో జరిగింది. నిందితుడిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు ఆదివారం వెల్లడించారు.
ఈ నెల 7న శిక్షణా తరగతులకు వెళ్లిన తన సోదరి ఇంటికి తిరిగి రాలేదని తన్వీర్ అహ్మద్ ఖాన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా పోలీసులు అనుమానితులను విచారించారు. మొహంద్పొర బుద్గామ్కు చెందిన షబీర్ అహ్మద్ నేరం చేసినట్టు అంగీకరించాడు.