ముంబయి : మహారాష్ట్ర చంద్రాపూర్ జిల్లా తాడోబా అభయారణ్యంలో ఘోరం జరిగింది. పులి దాడిలో అటవీశాఖ మహిళా ఉద్యోగిని మృతి చెందింది. పులుల గణన కోసం అటవీ సిబ్బంది శనివారం ఉదయం అభయారణ్యంలోకి వెళ్లింది. ఈ క్రమంలో ఓ మహిళా ఉద్యోగినిపై పులి దాడి చేసింది. అనంతరం పొదల్లోకి లాక్కెళ్లి చంపేసింది. దీంతో మిగతా అధికారులు అప్రమత్తమై వెనుతిరిగారు.