కొచ్చి: భారత నావికాదళానికి చెందిన శిక్షణ హెలికాప్టర్ శనివారం ఉదయం కొచ్చిలోని ఐఎన్ఎస్ గరుడ నావల్ ఎయిర్‌స్టేషన్ రన్‌వేపై కుప్పకూలింది. ఈ ప్రమాదంలో నావికా దళ సెయిలర్ యోగేంద్ర సింగ్ ప్రాణాలు కోల్పోయారు. ఆయన మధ్యప్రదేశ్‌కు చెందినవారు.
శిక్షణ ఇవ్వడం కోసం బయల్దేరిన ఈ చేతక్ హెలికాప్టర్ కాసేపటికే కూలిపోయినట్లు అధికారులు వెల్లడించారు. ఘటనపై దర్యాప్తునకు ఆదేశించినట్టు తెలిపారు.