రాంచీ: జార్ఖండ్లో పెను ప్రమాదం తప్పింది. దేవఘడ్ జిల్లాలోని ఓ రైల్వేక్రాసింగ్ వద్ద.. ట్రక్కును రైలు ఢీకొన్నది(Train Collision). నవాది రైల్వే క్రాసింగ్ వద్ద ఈ ఘటన జరిగింది. గోండా-అసన్సోల్ ఎక్స్ప్రెస్ వెళ్తున్న సమయంలో లెవల్ క్రాసింగ్ వద్ద గేటు తెరిచి ఉన్నది. ఆ గేటు నుంచి వెళ్లేందుకు ప్రయత్నించిన ట్రక్కు.. ట్రాఫిక్ వల్ల పట్టాలపైనే ఉండిపోయింది. అయితే అదే టైంలో వస్తున్న రైలు ఆ ట్రక్కును ఢీకొన్నది. ట్రక్కును ఢీకొన్న తర్వాత రైలు ఆగిపోయింది. ట్రక్కు పక్కన ఉన్న బైకర్లు ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. రైల్వే క్రాసింగ్ వద్ద భారీగా ట్రాఫిక్ ఉండడం వల్ల ట్రక్కు వెళ్లలేకపోయినట్లు రైల్వే అధికారులు చెప్పారు. ఈ ప్రమాదం వల్ల జైసిద్-అసన్సోల్ మార్గంలో రెండు గంటల పాటు రైలు ట్రాఫిక్ స్తంభించింది. ఈ ఘటన పట్ల దర్యాప్తు చేపట్టినట్లు అసన్సోల్ రైల్వే డివిజన్ ప్రతినిధి తెలిపారు. ప్రమాదంలో ధ్వంసమైన రైలు ఇంజిన్ను అక్కడ నుంచి తొలగించారు.
Train collided with a truck at a busy manned crossing in Deoghar, Jharkhand, India. 🇮🇳
Two motorcyclists sustained serious injuries and were rushed to a nearby hospital with the help of local residents. pic.twitter.com/auGNP9J6Br
— Shihab (@ShihabudeenMb) January 22, 2026