ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలోని ధారవి ప్రాంతంలో ఘోరం జరిగింది. ధారవిలోని సాహూ నగర్ ఏరియాలోగల ఓ ఇంట్లో ఈ మధ్యాహ్నం గ్యాస్ సిలిండర్ పేలింది ( Cylinder blast ). ప్రమాదంలో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నది. ఘటన జరిగిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడి చేరుకున్నారు. మంటలను ఆర్పేసి క్షతగాత్రులను సియాన్ ఆస్పత్రికి తరలించారు.
గ్యాస్ లీకేజీనే ప్రమాదానికి కారణమని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ముందుగా గ్యాస్ లీకై సిలిండర్‌కు మంటలు అంటుకున్నాయని, ఆ తర్వాత సిలిండర్ పేలిపోవడంతో పెద్దఎత్తున మంటలు ఎగిసిపడ్డాయని పోలీసులు తెలిపారు. ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉందన్నారు.
#UPDATE | A total of 15 people were injured, including 5 seriously injured in the cylinder blast in Dharavi, Mumbai
— ANI (@ANI) August 29, 2021
(Visuals from the spot) pic.twitter.com/BYZLR6k1yk