కార్వార్: జీపీఎస్ ట్రాకింగ్ పరికరం కలిగిన సముద్రపు కాకిని కర్ణాటకలోని కార్వార్ తీరంలో బుధవారం స్థానికులు గుర్తించారు. ఉత్తర కన్నడ జిల్లాలో ఐఎన్ఎస్ కదంబ నౌకకు కొద్ది దూరంలోని తిమ్మక ఉద్యాన వెనుక ఉన్న ఆ పక్షిని వారు అటవీ శాఖకు అప్పగించారు.
జీపీఎస్ ట్రాకింగ్ పరికరంపై చైనా పరిశోధన సంస్థ ఈ-మెయిల్ ఉండటం.. ఆ పక్షి భారత్కు వ్యూహాత్మకంగా కీలకమైన కార్వార్ నౌకా దళ స్థావరానికి దగ్గరలో లభించడంపై పలు రకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ పక్షిని భారత నౌకా దళంపై నిఘా కోసం పంపి ఉండొచ్చని కూడా అధికారులు అనుమానిస్తున్నారు.