న్యూఢిల్లీ: భూమిపై ప్రతి ఏటా కృత్రిమ కాంతి పెరుగుతున్నదని.. దీంతో భూమి మరింత ప్రకాశవంతంగా మారుతున్నదని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. ఇది కాంతి కాలుష్యానికి సూచికగా పరిశోధకులు చెబుతున్నారు. ‘కనెక్టికట్ వర్సిటీ’కి చెందిన పరిశోధకులు గత 9 సంవత్సరాల కాలంలో 11 లక్షలకుపైగా ఉపగ్రహ చిత్రాలను విశ్లేషించారు. 2014-2022 మధ్య కాలంలో భూమిపై కృత్రిమ కాంతి 16 శాతం మేర పెరిగింది. ఇది మునపటి అధ్యయనం 2017 నాటి ఫలితానికి దగ్గరగా ఉంది. కృత్రిమ కాంతితో వెలిగే బహిరంగ ప్రదేశాలు ఏటా 2 శాతం విస్తరిస్తున్నాయని, చాలా ప్రాంతాలకు ‘కాంతి కాలుష్యం’ వ్యాపిస్తున్నదని నాటి అధ్యయనం పేర్కొన్నది.