న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో అరుదైన సన్నివేశం చోటుచేసుకుంది. సీజేఐ నేతృత్వం వహిస్తున్న ధర్మాసనం ముందు మూగ, చెవిటి అయిన దివ్యాంగ న్యాయవాది వాదనలు వినిపించారు. ఓ కేసు విషయంలో వర్చువల్గా విచారణ చేపట్టగా, దివ్యాంగ న్యాయవాది సారా సన్నీకి స్క్రీన్ స్పేస్ ఇవ్వడానికి కంట్రోల్ రూమ్ తొలుత నిరాకరించింది. ఆమె సీనియర్ న్యాయవాది విషయాన్ని సీజేఐ డీవై చంద్రచూడ్ దృష్టికి తీసుకెళ్లారు.
సైన్ లాంగ్వేజ్ (సైగలతో కూడిన భాష) నిపుణుడికి అనుమతి ఇవ్వాలంటూ కోర్టును కోరారు. ‘పరవాలేదు.. ఆయన స్క్రీన్లో జాయిన్ కావొచ్చు’ అంటూ సీజేఐ వెంటనే ఆమోదం తెలిపారు. భారతీయ సైన్ లాంగ్వేజ్ నిపుణుడు సౌరవ్ రాయ్ చౌదరీ ద్వారా సారా సన్నీ కోర్టులో తన వాదనలు వినిపించారు. వర్చువల్ విచారణలో దివ్యాంగ న్యాయవాది సారా సన్నీ, సైన్ లాంగ్వేజ్ నిపుణుడు సౌరవ్ రాయ్ చౌదరీ ఇద్దరికీ సీజేఐ స్పేస్ కల్పించారు. కేరళకు చెందిన సారా సన్నీ ఎంతో కష్టపడి న్యాయవిద్యను పూర్తిచేశారు.