ముంబై: ముంబై నుంచి భుజ్ వెళ్లిన అలియన్స్ ఎయిర్ సంస్థకు చెందిన విమానం .. ఇంజిన్ కవర్ లేకుండానే ప్రయాణించింది. రన్‌వేపై ఇంజిన్ కవర్ కూలిన ఆ విమానంలో 70 మంది ప్రయాణించారు. ఈ ఘటన పట్ల పౌర విమానయాన శాఖ దర్యాప్తు ప్రారంభించింది. ఇవాళ ఉదయం అలియన్స్ ఎయిర్ ఏటీఆర్ 72-600 విమానం ముంబై నుంచి గుజరాత్‌లోని భుజ్‌కు బయలుదేరి వెళ్లింది. అయితే ఆ విమానం మాత్రం సురక్షితంగానే ల్యాండ్ అయ్యింది. కానీ టేకాఫ్ సమయంలో ఆ విమాన ఇంజిన్ కవర్ ఊడిపోయింది. టేకాఫ్‌ను మానిటర్ చేసిన ఏటీసీ వార్నింగ్ సిగ్నల్ ఇచ్చింది. ఆ కవర్‌ను రన్‌వేపై గుర్తించారు. 70 మంది విమానంలో నలుగురు సిబ్బంది, ఓ మెంటేనెన్స్ ఇంజినీర్ ఉన్నారు.