ముంబై: సాధారణంగా ట్రాఫిక్ పోలీసులు నిషేధిత ప్రాంతాల్లో పార్కింగ్ చేసిన ద్విచక్ర వాహనాలను వాహనంపైకి ఎక్కించి పోలీస్ స్టేషన్కు తరలిస్తారు. అయితే బైక్తోసహా వాహనదారుడిని కూడా ట్రాఫిక్ ట్రాలీపైకి లాగిన వైనం ఆశ్చర్యం రేకిత్తించింది. మహారాష్ట్రలోని పూణేలో గురువారం ఈ ఘటన జరిగింది. మరోవైపు దీనిపై ట్రాఫిక్ డీసీపీ వివరణ ఇచ్చారు. నో పార్కింగ్ వద్ద బైక్ను పార్క్ చేశారని, తమ సిబ్బంది దానిని ట్రాలీ పైకి లాగినప్పుడు, యజమాని వచ్చి దానిపై కూర్చున్నట్లు తెలిపారు. ఆయనను కిందకు దిగమని కోరామని, తర్వాత ఆ వ్యక్తి తన తప్పును ఒప్పుకుని జరిమానా చెల్లించినట్లు చెప్పారు. కాగా, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
#WATCH | Maharashtra: A motorcycle was towed in Pune y'day while its rider was sitting on it
— ANI (@ANI) August 20, 2021
DCP Traffic says, "Bike was parked in no parking. When our officials towed it, owner came &sat on it. He was requested to get down. Later he did & accepted his mistake. He paid the fine" pic.twitter.com/987qnbTPtu