Nipah Virus | నిపా వైరస్ బాలుడు గుండెపోటుతో కన్నుమూత..! కేరళలో కలకలం..!
Nipah Virus | కేరళలో నిపా వైరస్ ఓ బాలుడిని బలి తీసుకున్నది. మలప్పురం జిల్లాకు చెందిన 14 ఏళ్ల బాలుడు ఆదివారం ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. వైరస్ సోకిన బాలుడిని వెంటిలెటర్‌పై ఉంచి చికిత్స అందిస్తుండగా గుండెపోటు రావడంతో కన్నుమూసినట్లుగా సమాచారం.
Nipah Virus | కేరళలో నిపా వైరస్ ఓ బాలుడిని బలి తీసుకున్నది. మలప్పురం జిల్లాకు చెందిన 14 ఏళ్ల బాలుడు ఆదివారం ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. వైరస్ సోకిన బాలుడిని వెంటిలెటర్‌పై ఉంచి చికిత్స అందిస్తుండగా గుండెపోటు రావడంతో కన్నుమూసినట్లుగా సమాచారం. వైరస్ సోకిందని గుర్తించిన కొద్ది గంటల్లోనే.. బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. అంతర్జాతీయ నిబంధనల మేరకు బాలుడి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. రాష్ట్రంలో నిపా వైరస్ కేసులు వెలుగు చూడడంతో కేరళ ప్రభుత్వం అప్రమత్తమైంది. బాలుడి హై రిస్క్ కాంటాక్టులను ఇప్పటికే గుర్తించి.. వారిని కాపాడేందుకు ఆస్ట్రేలియా నుంచి కొనుగోలు చేసిన మోనోక్లోనల్ యాంటీబాడీలను ఆర్డర్ చేసింది. వైరస్ సోకిన బాలుడు ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతు మరణించినట్లు ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్క్ తెలిపారు. గతేడాది సెప్టెంబర్ తర్వాత నమోదైన తొలి నిపా కేసు ఇదే.
బాలుడు వైద్యం కోసం మే 12న ఓ ప్రైవేటు క్లినిక్‌కు వచ్చాడు. మే 15న ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరాడు. పరిస్థితి మెరుగుకాపోవడంతో బాలుడిని కోజికోడ్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. బాలుడు నిపా వైరస్ సోకి మృతి చెందడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. కాంటాక్టులను గుర్తించే పనిలో పడింది. హై రిస్క్ కాంటాక్టులను వేరు చేశారు. నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం పుణేలోని ఎన్వీఏకు పంపారు. చివరిసారిగా ఆస్ట్రేలియా నుంచి మోనోక్లోనల్ యాంటీబాడీలను కొనుగోలు చేశామని, వాటిని పూణె ఎన్ఐవీలో ఉంచామని, అవి నేడు కేరళకు చేరుకుంటాయని ఆరోగ్య మంత్రి తెలిపారు. ఇది మంజేరి మెడికల్ కాలేజీలో ఆరోగ్య శాఖ 30 ఐసోలేషన్ వార్డులను, ఆరు పడకల ఐసీయూను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మలప్పురంలో కాల్ సెంటర్, కంట్రోల్ రూమ్‌ను ప్రారంభించినట్లు చెప్పారు. వైరస్‌ను ఎదుర్కొనేందుకు పూణె ఎన్ఐవీ గత సారి మాదిరిగానే మొబైల్ ల్యాబ్‌ను అందించాలని చెప్పిందని మంత్రి తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

