Babylonian Map | న్యూఢిల్లీ: దాదాపు 2,600 నుంచి 2,900 ఏళ్ల క్రితం చిత్రీకరించిన ప్రపంచ పటం శిలాఫలకం రూపంలో ఇప్పటికీ భద్రంగా ఉంది. బాబిలోనియన్ ప్రపంచ పటంగా పిలిచే దీన్ని వాస్తు, సంస్కృతి, గణితం, శాస్త్ర రంగాల్లో నియో బాబిలోయిన్ సామ్రాజ్యం పరిఢవిల్లిన కాలంలో దీనిని రూపొందించారు. ప్రముఖ ఆర్కియాలజిస్ట్ హోర్ముజ్డ్ రస్సమ్ 1881లో ప్రస్తుత ఇరాక్‌లో దీన్ని గుర్తించారు. ప్రపంచంలో అత్యంత ప్రాచీన సాహితీ ప్రక్రియ గిల్గేష్ ఈ ఫలకంలో కనిపించింది.
మిడిల్ ఈస్ట్‌లో ఉన్న మెసపటోమియాను చారిత్రక ప్రాంతంగా దీనిలో చూపించారు. బాబిలోన్ నగరాన్ని దీర్ఘ చతురస్రాకారంలో, మహా సముద్రాన్ని వృత్తాకారంలో చూపించారు. అసిరియా, డేర్, ఉరర్టు వంటి రాజ్యాలు, నగరాలను కూడా మార్క్ చేశారు. ఈ పటానికి పై భాగంలో సూర్యుడు కానరాని ప్రాంతంగా పేర్కొన్నారు. ఇక్కడ నిరంతరం చీకటి ఉంటుందని వారు భావించి ఉండవచ్చు.
భోలే బాబా అరెస్ట్‌కు బాధిత కుటుంబాల డిమాండ్
లక్నో: స్వయం ప్రకటిత బాబా నారాయణ్ సాకార్ హరి (భోలే బాబా)పై ప్రజాగ్రహం పెల్లుబుకుతున్నది. ఈ నెల 2న ఆయన నిర్వహించిన సత్సంగ్‌లో జరిగిన తొక్కిసలాటలో మరణించిన, గాయపడినవారి కుటుంబ సభ్యులు ఆయనను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. యూపీలో జరిగిన ఈ దుర్ఘటనలో 121 మంది ప్రాణాలు కోల్పోగా, వందలాది మంది గాయపడిన సంగతి తెలిసిందే. అలీగఢ్‌లోని బాధిత కుటుంబాలు స్పందిస్తూ, బాబా నాలుగు రోజుల నుంచి కనిపించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఈ విశ్వమంతటికీ అధిపతి అయి ఉంటే, అందరి ముందుకు రావాలన్నారు. తాము ఇక ఆయనను నమ్మబోమని, ఆయనను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారుధ