మైసూరు: కర్ణాటకలోని మైసూరుకు చెందిన ఓ వ్యక్తి 12 ఏండ్లుగా తన భార్యను ఇంట్లోనే బందీని చేశాడు! రోజూ తాను ఉద్యోగానికి బయటికి వెళ్లేటప్పుడు భార్యను ఇంట్లోనే ఉంచి తాళం వేసుకొని వెళ్లేవాడు. తనను బంధించిన గదిలోనే ఒక చిన్న పెట్టెలో కాలకృత్యాలు తీర్చుకొనే దానినని బాధితురాలు వాపోయింది.
విషయం తెలిసిన పోలీసులు ఆమె భర్తకు ఈ విషయమై కౌన్సెలింగ్ ఇచ్చారు. భర్తపై ఫిర్యాదు చేయడానికి బాధితురాలు నిరాకరించింది. ఇకపై పుట్టింట్లో ఉంటానని తెలిపింది.