హైదరాబాద్: జీవి ఏదైనా తల్లి మనసు తల్లి మనసే. కన్న బిడ్డ కాసేపు కనబడకపోతే మనిషే కాదు.. పిల్లి, కుక్క, ఆవు, బర్రె, మేక, కోడి, ఎలుక ఇలా ఏ జీవి అయినా తల్లఢిల్లిపోతుంది. అందుకు సంబంధించి మనం ఎన్నో ఘటనలు చూసి ఉంటాం. అలాంటిదే తాజాగా మరో ఘటన చోటుచేసుకుంది.
కనిపించకుండా పోయిన తన బిడ్డ కోసం ఓ తల్లి పిల్లి అంతటా వెతికింది. చివరికి ఓ ఇంటి వెనకాల తన పిల్ల కనిపించడంతో ఏం చేయాలో పాలుపోక కాసేపు ఆగింది. ఆ తర్వాత పిల్ల దగ్గరికి వెళ్లి చెంపపై లాగి ఒక్కటిచ్చింది. ఆ వెంటనే పిల్లను నోట కరుచుకుని తన స్థావరానికి ఎత్తుకెళ్లింది.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నెటిజన్ల నుంచి లైకులతోపాటు కామెంట్ల వర్షం కురుస్తున్నది. ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాదతోపాటు పలువురు నెటిజన్లు ట్విటర్లో ఉన్న ఈ వీడియోను రీ ట్వీట్ చేస్తున్నారు.
A lost kitten and her mother found her, she slapped her and took her home. 😂pic.twitter.com/UNLA0LxOXC
— Figen (@TheFigen_) September 28, 2023