Viral Video | పాములు అంటేనే కప్పలకు భయం. కప్పలను పాములను చూశాయంటే చాలు.. ఇక అంతే.. వాటిని అమాంతం మింగేస్తాయి. ఆ తర్వాత తీవ్ర ఆయాసం పడుతుంటాయి పాములు. కానీ ఈ వీడియోలో మాత్రం శత్రుత్వాన్ని వదిలి పెట్టాయి పాము, కప్ప. చాలా స్నేహంగా గడిపాయి ఆ రెండు కూడా. హాయిగా నిద్రిస్తున్న పాముపై కప్ప జారిపోయింది. ఆ సమయంలో కప్పకు పాము ఎలాంటి హానీ కలిగించలేదు. ఈ వీడియోను షేర్ చేసిన నెటిజన్ ఈ విధంగా రాసుకొచ్చాడు. ధైర్యం అంటే భయం లేకపోవడం కాదు.. ముందు భయాన్ని ఎదుర్కొనే ధైర్యం ఉండాలని పేర్కొన్నాడు. పది సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉంది. ఈ వీడియోను 12 వేల మంది వీక్షించగా, 600 మంది లైక్ చేశారు.
साहस का मतलब भय की अनुपस्थिति नहीं बल्कि भय सामने होते हुए भी दृढ़ता से सामना करना ही साहस है..! pic.twitter.com/2Xz6dEJKhG
— Sanjay Kumar, Dy. Collector (@dc_sanjay_jas) November 25, 2022