Civils-2022 Ranker | వైకల్యాన్ని జయించి సివిల్స్ సాధించి.. కేరళ మహిళ విజయ ప్రస్థానం
Civils-2022 Ranker | ఐదేళ్ల వయస్సప్పుడే రోడ్డు ప్రమాదంలో కుడిచేయి తెగిపోయింది. అయినా తన వైకల్యానికి ఆమె అదరలేదు, బెదరలేదు..! ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు..! పట్టుదలతో ప్రయత్నించి అనుకున్నది సాధించింది..! సివిల్స్ - 2022 పరీక్షల్లో మంచి ర్యాంకు దక్కించుకుంది..!
తిరువనంతపురం: చాలా మంది అన్నీ ఉన్నా ఏమీ చేయలేకపోతారు..! కొద్ది మంది మాత్రం ఏమీ లేకపోయినా, ఆఖరికి అంగ వైకల్యం ఉన్నా అనుకున్నది సాధించగలుగుతారు..! కేరళకు చెందిన ఓ మహిళ రెండో కోవకు చెందిన వ్యక్తి..! ఆమెకు ఐదేళ్ల వయస్సప్పుడే రోడ్డు ప్రమాదంలో కుడిచేయి తెగిపోయింది. అయినా తన వైకల్యానికి ఆమె అదరలేదు, బెదరలేదు..! ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు..! పట్టుదలతో ప్రయత్నించి అనుకున్నది సాధించింది..! సివిల్స్ – 2022 పరీక్షల్లో మంచి ర్యాంకు దక్కించుకుంది..!
కేరళ రాజధాని తిరువనంతపురం పట్టణానికి చెందిన బీఎస్ అఖిల తనకు ఐదేళ్ల వయస్సు ఉన్నప్పుడు కుటుంబసభ్యులతో కలిసి బస్సులో వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. వారు ప్రయాణిస్తున్న బస్సు ఎదురుగా వస్తున్న మరో వాహనాన్ని ఢీకొట్టడంతో కుడిచేయి తెగిపోయింది. అయినా చేయి పోయిందని ఆమె కుంగిపోలేదు. బుద్ధిగా చదువుకున్నది. ఉన్నత విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత ఐఏఎస్ లక్ష్యంగా పెట్టుకుంది. కార్యదీక్షతో చదివి ఆలిండియా లెవల్లో 760వ ర్యాంకు సాధించింది.
అయినా ఆమె సంతృప్తి చెందడంలేదు. తన లక్ష్యం ఐఏఎస్ అధికారి కావడం అని, ప్రస్తుతం తనకు వచ్చిన ర్యాంకుతో ఐఏఎస్ సాధించడం కుదరదని, కాబట్టి ఐఏఎస్ కావడం కోసం మళ్లీ సివిల్స్ రాస్తానని అఖిల వెల్లడించింది. రోడ్డు ప్రమాదంలో వైకల్యం సంభవించినా వెరవకుండా పట్టుదలతో చదువుతున్న అఖిల భవిష్యత్తులో తన లక్ష్యాన్ని నెరవేర్చుకోవాలని మనం కూడా ఆశిద్దాం..
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

