Pooja Khedkar ముంబై, జూలై 16 (నమస్తే తెలంగాణ): ఇటీవల వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన ట్రైనీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకొన్నది. అడ్డదారుల్లో ఆమె ఐఏఎస్ ఉద్యోగం సంపాదించారన్న ఆరోపణలపై ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు.
ట్రైనీ ఐఏఎస్‌గా మహారాష్ట్రలో వెంటనే శిక్షణను నిలిపివేసి జూలై 23లోపు తిరిగి ముస్సోరిలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ ఆడ్మినిస్ట్రేషన్‌కు వెనక్కి రావాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ మేరకు జనరల్ అడ్మినిస్ట్రేషన్ విభాగం ఓ ప్రకటన విడుదల చేసింది. మరోవైపు పుణే కలెక్టర్ తనను వేధిస్తున్నారని ఖేద్కర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.