Crime news : మహిళలు, చిన్నారుల రక్షణ కోసం ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా ఆడవాళ్లపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా చిన్నారులను కూడా మానవ మృగాలు వదలడంలేదు. పసిబిడ్డలపై అఘాయిత్యాలకు పాల్పడుతూ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు. తాజాగా మహారాష్ట్రలోని పుణెలో అలాంటిదే మరో ఘటన జరిగింది. నాలుగేళ్ల చిన్నారిపై ఆ చిన్నారి కుటుంబానికి బాగా తెలిసిన వ్యక్తే అత్యాచారం చేసి పారిపోయాడు.
ఈ ఘటన పుణెలో కలకలం రేపింది. బాధితురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు ముంధ్వా స్టేషన్ పోలీసులు POCSO చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చేపట్టినట్టు తెలిపారు. నిందితుడిని పట్టుకునేందుకు కొన్ని బృందాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఘటనపై తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని అన్నారు.