నీళ్లలో ఉండే మొసలి మీ ఇంటి ముందు ప్రతక్ష్యమైతే ఎలా ఉంటుంది? వామ్మో అని అనుకుంటున్నారా? ఉత్తరప్రదేశ్లోని శివకుటి గ్రామస్తులకు ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఇటీవల కురిసిన వర్షాలకు నివాస ప్రాంతంలోకి మొసలి కొట్టుకొని వచ్చింది. మొసలి వీడియోను ఓ జర్నలిస్ట్ ట్విటర్లో షేర్ చేయగా, వైరల్గా మారింది.
పాతబస్టాండ్ సమీపంలోని ఓ కాలనీలో ఈ మొసలి కనిపించింది. మొసలిని గుర్తించిన స్థానికులు వెంటనే అధికారులకు సమాచారం అందించారు. సమీపంలోని మాధవ్ నేషనల్ పార్క్ నుంచి రెస్క్యూ టీమ్ వచ్చి గంటకు పైగా ఆపరేషన్ నిర్వహించింది. అనంతరం మొసలిని బంధించింది. నేషనల్ పార్క్ ఆవరణలో ఉన్న సాంఖ్య సాగర్ సరస్సులో దాన్ని విడిచిపెట్టినట్టు సబ్ డివిజనల్ ఆఫీసర్ ఆఫ్ పోలీస్ అజయ్ భార్గవ తెలిపారు.
प्रयागराज के शिवकुटी में बाढ़ में पहुंचा मगरमच्छ पकड़ा गया @MediaHarshVT pic.twitter.com/Ha7ADszXF8
— VIJAY PANDEY (@VIJAYPANDEY8) August 27, 2022