Posani Krishna Murali | విజయ్‌ని రాజకీయ అభిమన్యుడిని చేసే కుట్ర.. గవర్నర్ తీరుపై అసహనం వ్యక్తంచేసిన పోసాని
Posani Krishna Murali | తమిళనాడు (Tamil Nadu) అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) లో అద్భుత ఫలితాలు సాధించి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచిన టీవీకే పార్టీ (TVK Party) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకుండా ఆ రాష్ట్ర గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ (Rajendra Viswanath Arleker) అడ్డుపడుతున్నారు. విజయ్‌కి గవర్నర్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వకపోవడంపై సినీ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali) తీవ్రంగా స్పందించారు.
Posani Krishna Murali | తమిళనాడు (Tamil Nadu) అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) లో అద్భుత ఫలితాలు సాధించి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచిన టీవీకే పార్టీ (TVK Party) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకుండా ఆ రాష్ట్ర గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ (Rajendra Viswanath Arleker) అడ్డుపడుతున్నారు. విజయ్‌కి గవర్నర్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వకపోవడంపై సినీ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali) తీవ్రంగా స్పందించారు. విజయ్ చుట్టూ రాజకీయ కుట్ర జరుగుతోందని, ఆయనను ‘రాజకీయ అభిమన్యుడిని (Political Abhimanyu)’ చేసే ప్రయత్నం చేస్తున్నారని పోసాని ఆవేదన వ్యక్తంచేశారు.
అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకేను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించకుండా మెజారిటీ నిరూపించుకోవాలని గవర్నర్ కోరడం పక్షపాతంతో కూడిన నిర్ణయమని పోసాని అభిప్రాయపడ్డారు. ఇది విజయ్‌ని అడ్డుకోవడానికి జరుగుతున్న ప్లాన్‌లో భాగమేనని ఆరోపించారు. విజయ్ తనకు 1996 నుంచి తెలుసని, ఆయన తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్‌తో కూడా తనకు పరిచయం ఉందని పోసాని గుర్తు చేసుకున్నారు. విజయ్ ఎప్పుడూ అధికారం కోసం పాకులాడే వ్యక్తి కాదని, ఎన్ని గొడవలు ఎదురైనా ఎంతో సంయమనంతో వ్యవహరిస్తారని కొనియాడారు. తమిళనాడు రాజకీయాల్లో విజయ్‌ని ఒంటరిని చేసేందుకు పెద్ద ఎత్తున కుట్రలు జరుగుతున్నాయని, ఆయనకు దక్కాల్సిన అవకాశాన్ని అడ్డుకోవడం ప్రజాస్వామ్య విరుద్ధమని మండిపడ్డారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Destiny | నందినీ రెడ్డి చేతుల మీదుగా ‘డెస్టినీ’ ఫస్ట్ లుక్ లాంచ్.. ఇంట్రెస్టింగ్గా ఇమ్మాన్యుయేల్ లుక్!
శ్రీ రామలింగేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్‌ను సత్వరమే పూర్తి చేయాలి : మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్
KTR | సహకార సంఘాల బలోపేతానికి బీఆర్ఎస్ సహకారం : కేటీఆర్
Plague Disease | ప్లేగు వ్యాధిలో అసలు ఎన్ని రకాలు ఉన్నాయి.. ఈ వ్యాధి ఎలా వస్తుంది..?
PM Modi | కెనడాలో పర్యటించనున్న ప్రధాని మోదీ.. డిసెంబర్ 11, 12 తేదీల్లో షెడ్యూల్ ఖరారు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

