Mohammed Yousuf Tarigami | ముస్లిం ఆధిపత్య ప్రాంతంలో కమ్యూనిస్ట్ జెండా రెపరెపలు.. కుల్గామ్‌లో ఐదోసారి సీపీఎం అభ్యర్థి తరిగామి గెలుపు
Mohammed Yousuf Tarigami | జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో అరుదైన సంఘటన జరిగింది. ముస్లిం ఆధిపత్య ప్రాంతంలో కమ్యూనిస్ట్ జెండా మళ్లీ రెపరెపలాడింది. కశ్మీర్‌లోని కుల్గామ్ స్థానంలో సీపీఎం అభ్యర్థి గెలుపొందారు. ఇక్కడ ఐదోసారి విజయం సాధించిన మహ్మద్ యూసుఫ్ తరిగామి మరోసారి రాజకీయంగా తనదైన ముద్ర వేశారు.
శ్రీనగర్: జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో అరుదైన సంఘటన జరిగింది. ముస్లిం ఆధిపత్య ప్రాంతంలో కమ్యూనిస్ట్ జెండా మళ్లీ రెపరెపలాడింది. కశ్మీర్‌లోని కుల్గామ్ స్థానంలో సీపీఎం అభ్యర్థి గెలుపొందారు. ఇక్కడ ఐదోసారి విజయం సాధించిన మహ్మద్ యూసుఫ్ తరిగామి (Mohammed Yousuf Tarigami) మరోసారి రాజకీయంగా తనదైన ముద్ర వేశారు. నిషేధిత జమాతే ఇస్లామీ (జేఈఐ) మద్దతుతో ఇస్లాం పేరుతో ఓట్లు అడిగిన సాయర్ అహ్మద్ రేషిపై 8,000 ఓట్ల మెజారిటీతో గెలిచారు. కుల్గాంలో అభ్యర్థిని నిలబెట్టని నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) తరిగామికి మద్దతు ఇచ్చింది. అహ్మద్ రేషి రెండో స్థానంలో ఉండగా, పీడీపీ అభ్యర్థి మహ్మద్ అమీన్ దార్ మూడో స్థానంలో నిలిచారు.
కాగా, దక్షిణ కశ్మీర్‌లోని కుల్గామ్ స్థానం సీపీఎం పార్టీకి కంచుకోటగా నిలిచింది. ఆ పార్టీ సీనియర్ నేత మహ్మద్ యూసుఫ్ తరిగామి ఈ ప్రాంతంలో తనదైన రాజకీయ ముద్ర వేశారు. 1996 నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఇక్కడ గెలిచారు. తాజాగా ఐదోసారి కూడా కమ్యూనిస్ట్ జెండాను రెపరెపలాడించారు. తన గెలుపు ఇస్లాం ఓటమి కాదని ఆయన అన్నారు. అల్లర్లు, హింసకు పాల్పడిన జమాతే ఇస్లామీ దౌర్జన్యం, మోసపూరిత రాజకీయాలను ఇది బట్టబయలు చేసిందని విమర్శించారు. కశ్మీర్ కోసం, కశ్మీర్ హక్కుల కోసం కుల్గామ్ ప్రజలు తన విజయానికి సహకరించారని అన్నారు.
మరోవైపు 1979లో షేక్ అబ్దుల్లా ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తనను అరెస్ట్ చేశారని మహ్మద్ యూసుఫ్ తరిగామి గుర్తు చేశారు. తన అరెస్ట్‌పై అబ్దుల్లాను మీడియా అడగ్గా ‘వో జో తరిగం వాలా’ అని అన్నారని, తన స్వస్థలం గురించి ఆయన ప్రస్తావించారని తెలిపారు. అయితే తాను తరిగామిలో పుట్టలేదని చెప్పారు. నాటి నుంచి తనను మహమ్మద్ యూసుఫ్ తరిగామిగా మీడియా పిలుస్తున్నదని అన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. అభిజిత్ దీప్కే సహా ముగ్గురు నేతల ముందస్తు అరెస్ట్..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

