ముంబై: అర కిలో మీటరు దూరం కూడా లేని గమ్యానికి ఒక విదేశీ పర్యాటకురాలి నుంచి క్యాబ్ డ్రైవర్ రూ.18 వేలు వసూలు చేసి దారుణంగా మోసగించాడు. బాధితురాలు ఈ విషయాన్ని ఎక్స్‌లో వెల్లడించింది. ఈ నెల 26న ముంబైలో అమెరికా పర్యాటకురాలు ముంబైలో హిల్టన్ హోటల్‌కు వెళ్లడానికి ఒక ట్యాక్సీ ఎక్కింది.
ఒక క్యాబ్ డ్రైవర్, మరో వ్యక్తి కలిసి ఆమెను కారులో 20 నిమిషాలు తిప్పి, తీరా బయలుదేరిన ప్రదేశానికి కేవలం 400 మీటర్ల దూరంలోని ఆమె హోటల్లో దింపి, ఆమె దగ్గర నుంచి 200 డాలర్లు (రూ.18,000) వసూలు చేశారు. తనకు జరిగిన మోసాన్ని ఆమె ఎక్స్‌లో తెలిపి, ఆ క్యాబ్ వివరాలు కూడా వెల్లడించడంతో స్పందించిన ముంబై సహర్ పోలీసులు క్యాబ్ డ్రైవర్ దేశ్రాజ్ యాదవ్ (20)ను అరెస్ట్ చేశారు.