ముంబై: పెట్రోల్, గ్యాస్ ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ శనివారం పలు చోట్ల నిరసన కార్యక్రమాలు నిర్వహించింది. ఇందులో భాగంగా మహారాష్ట్రలోని ముంబైలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఎడ్ల బండిపై నిరసన తెలిపారు. ఇంధన ధరల పెరుగుదలను వ్యతిరేకిస్తూ ఫ్లకార్డులు, గ్యాస్ సిలిండర్లు ప్రదర్శించారు. అయితే ఎడ్ల బండిపైకి ఎక్కువ మంది ఎక్కడంతో అది కూలిపోయింది. దీంతో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనతో ఎద్దులు కూడా బెదిరిపోయాయి. కాగా, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
#WATCH | Maharashtra: A bullock cart, on which Congress workers and leaders were protesting in Mumbai today, collapses. They were protesting against the fuel price hike. pic.twitter.com/INqHWpNi7C
— ANI (@ANI) July 10, 2021