న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్లోని జలాలాబాద్ పట్టణంలో ఓ ఎద్దు(Bull Attack) బీభత్సం చేసింది. రోడ్డుపై తిరుగుతూ అది ప్రజలపై అటాక్ చేసింది. పలువుర్ని తన కొమ్ములతో పొడిచేసింది. ట్రాఫిక్ మధ్యలోనే అది భయానకం సృష్టించింది. ఓ వ్యక్తిని పలు మార్లు కిందపడేసి .. కొమ్ములతో పొడిచింది. ఆ వ్యక్తి కంటికి గాయమైంది. అతను తీవ్రంగా గాయపడ్డాడు. కంటి నుంచి తీవ్ర రక్తస్త్రావం అయ్యింది. వీధుల్లో తిరుగుతూ ఆ ఎద్దు మళ్లీ జనంపై దాడి చేసింది. కొన్ని చోట్ల తొక్కిసలాట జరిగింది. ఆ ఎద్దు దాడిలో మొత్తం 15 మంది గాయపడ్డారు.
ఓ గంట పాటు ఆ ఎద్దు తీవ్ర అలజడి సృష్టించింది. అయితే ఆ తర్వాత జలాలాబాద్ మున్సిపల్ అధికారులు దాన్ని పట్టుకునే ప్రయత్నం చేశారు. కనీసం మూడు గంటల పాటు మున్సిపల్ సిబ్బది దాని వెంటపడ్డారు. చివరకు అది చిక్కింది.