నాగ్‌పూర్, జూలై 24: అమెరికా వెళ్లి పనిచేయాలని ఆ కుర్రాడి చిన్నప్పటి కల. అందుకోసం కోడింగ్‌లో నైపుణ్యం సాధించాడు. ఎంతగా అంటే ఓ పోటీలో నెగ్గిన మనోడికి సదరు కంపెనీ ఏకంగా ఏడాదికి రూ.33 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం కూడా ఆఫర్ చేసింది. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన వేదాంత్ దేవకాటే అనే కుర్రాడు కోడింగ్‌లో టాప్.
ఇటీవల అతడి తల్లి ల్యాప్‌టాప్ చూస్తుండగా, కోడింగ్ పోటీకి సంబంధించి లింక్ కనిపించింది. దీంతో వెంటనే మనోడు దరఖాస్తు పెట్టుకుని రెండు రోజుల్లో 2,066 లైన్ల కోడ్ రాశాడు. ప్రపంచవ్యాప్తంగా వేల మంది పాల్గొన్న ఈ పోటీలో మనోడు విజేతగా నిలిచాడు. అమెరికాలోని న్యూజెర్సీలో ఉన్న ఓ యాడ్ కంపెనీ తెగ మెచ్చేసుకుని 33లక్షల ప్యాకేజీతో మనోడికి జాబ్ ఆఫర్ చేసింది.
అయితే ఇక్కడో ట్విస్ట్ ఉంది. మనోడి వయసెంతో తెలుసా కేవలం 15 ఏండ్లు. దీంతో కంపెనీ పాలసీ ప్రకారం అంత చిన్న పిల్లోడికి జాబ్ ఇవ్వడం కుదరదని వెనక్కి తగ్గింది. అయితే చదువు పూర్తి చేసుకుని తమకు కాంటాక్ట్ అయితే భవిష్యత్తులో జాబ్ ఇస్తామని కంపెనీ చెప్పింది.