షిమ్లా: హిమాచల్‌ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగింపు దశకు చేరింది. పోలింగ్ సమయం ముగిసినప్పటికీ గడువు లోపలే బూత్‌లకు చేరుకున్నవారు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అయితే ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ప్రదేశంలో ఉన్న పోలింగ్ బూత్‌లో మాత్రం ఇప్పటికే పోలింగ్ ముగిసింది.
హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రం తాషిగాంగ్లోని ఓ పోలింగ్ బూత్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ప్రదేశంలో ఉన్న పోలింగ్ బూత్‌గా రికార్డులకెక్కింది. ఆ పోలింగ్ బూత్ పరిధిలో మొత్తం 52 మంది ఓటర్లు ఉండగా.. 51 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. దాంతో ఆ బూత్ స్థాయిలో 98.08 శాతం పోలింగ్ నమోదైనట్లు అయ్యింది.
తాషిగాంగ్లోని ఆ పోలింగ్ బూత్ సముద్రమట్టానికి 15,256 అడుగుల ఎత్తులో ఉంది. హిమాచల్‌ప్రదేశ్‌లోని మొత్తం 68 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒకే విడతలో పోలింగ్ జరుగుతున్నది. డిసెంబర్ 8న ఓట్లు లెక్కించి ఫలితాలను వెల్లడించనున్నారు.