లక్నో : ఓ ఇంట్లో ఒకట్రెండు నాగుపాములు కాదు.. ఏకంగా 90 నాగుపాములు బయటపడ్డాయి. ఇంట్లోని పాత మట్టికుండను తెరిచి చూడగా పాములు కనిపించడంతో ఆ ఇంటి యజమాని షాక్కు గురయ్యాడు. ఉత్తరప్రదేశ్ అంబేద్కర్ నగర్ జిల్లాలోని అలపూర్ తహసీల్ పరిధిలోని మదువానా గ్రామంలో ఈ దృశ్యం వెలుగు చూసింది.
మదువానా గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన ఇంట్లోని పాత మట్టి కుండను తెరిచి చూశాడు. అయితే ఆ కుండలో కుప్పలు తెప్పలుగా పాములు కనిపించాయి. దీంతో ఆ యజమాని షాక్కు గురై గ్రామస్తులకు, అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాడు. ఆ కుండలో బయటపడ్డ 90 నాగుపాములను చూసేందుకు గ్రామస్తులు భారీగా తరలివచ్చారు. ఇక నల్ల తాచుపాములను అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకుని, అడవిలో వదిలేశారు. పాముల వల్ల ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని అధికారులు గ్రామస్తులకు సూచించారు.
#Ambedkarnagar : एक घर में मिट्टी के बर्तन के अंदर मिले सैकड़ों जहरीले सांप, ग्रामीणों में दहशत pic.twitter.com/pd2hymRISR
— Nidhi Tiwari (@NidhiTiwari2210) May 11, 2022